‘శివపంచాక్షరి’ స్త్రోత్ర శ్రవణం…ఓ అద్బుత భక్తి విన్యాసం

కార్తీక మాసంలో  భక్తులు నిరంతరం శివ నామస్మరణలో ఉంటారు.  అలా వారు భక్తిలో లీనమయ్యేందుకు `శివపంచాక్షరి స్తోత్రాన్ని`ని జపించటం ఓ మార్గం! శివపంచాక్షరి అంటే శివుడుని జపించే అయిదు అక్షరాల అద్బుత మంత్రం. అదే `నమః శివాయ`. ఈ  పంచాక్షరి మంత్రానికి మహిమను  జోడించి ఒక స్తోత్రాన్ని రూపొందించారు ఆదిశంకరులవారు. అదే శివపంచాక్షరి స్తోత్రం! ఈ పంచాక్షరి స్తోత్రాన్ని ఎవరైతే శివ సన్నిధిలో పఠిస్తారో లేదా వింటారో వారికి శివలోక ప్రాప్తితో పాటు, ఇక్కడ ఈ లోకంలో ఆ మహాదేవుని కృపతో సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. అందుకే ‘శివ టీవి’ వారు ఈ కార్తీక మాస పుణ్య దినాన శివపంచాక్షరి స్తోత్రాన్ని  సభక్తితో అందిస్తున్నారు. మనమూ మనఃస్ఫూర్తిగా ఈ స్త్రోత్రాన్ని వింటూ ఆ దేవ దేవుని స్మరించుకుందాం!  

నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశ్శివాయ …

సాక్షాత్తూ ఆ నాగేంద్రుడినే హారంగా కలిగిన త్రినేత్రుడు; భస్మమే ఆచ్ఛాదనగా, దిక్కులే వస్త్రాలుగా కలిగిన మహేశ్వరుడు; ఏ రకమైన మలినమూ సోకని శుద్ధుడు; అలాంటి శివునికి వందనం అంటూ సాగే  ఈ పంచాక్షరి  లో నమః అంటే నమస్కారము.,.శివాయ నమః అంటే శివభగవానునకు నమస్కారములు. ‘నమః’ జీవాత్మను సూచిస్తుంది. ‘శివ’ అనేది పరమాత్మను సూచిస్తుంది. ‘ఆయ’ అనేది ఐక్యాన్ని లేదా జీవాత్మ, పరమాత్మల ఉనికిని సూచిస్తుంది. ఈ అద్బుతాన్ని మీరు ఈ వీడియో వింటూ మనస్సులో దర్శించవచ్చు..ఓం  నమశ్శివాయ.

ఈ వీడియోని సభక్తితో అందించిన వారు: శివ టీవి
స్వరకల్పన: ప్రముఖ సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్
పాడిన వారు:`