శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్

‘ నా కార్తకసమో మాసో క కృతేన సమం యుగమ్‌,
న వేదసదృశం శాస్త్రం స తీర్థం గంగయా సమమ్’

అని స్కంద పురుణంలో ఉంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానదిని మించిన మరో నది లేనేలేదు అని అర్ధం. ఈ కార్తీక మాసంలో శివుడుని ఏ  రూపంలో ధ్యానించినా విశేష ఫలితం ఉంటుంది. ధార్మక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు.

  ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషరగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరుస్తాడని ప్రతీతి.  ఈ నేఫధ్యంలో శివ టీవీ వారు…శివుడుని విశేషంగా స్మరిస్తూ…శివ రూపమైన శ్రీ దక్షిణామూర్తి ,,,స్తోత్రమ్ ని సమర్పిస్తోంది.

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా |
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||  

అంటూ సాగే…దక్షిణామూర్తి రూపం చాలా శక్తివంతమైనది. శివాలయాలకు వెళ్లినప్పుడు శివుడి దర్శనం తర్వాత గుడి ప్రాంగణంలో దక్షిణ దిక్కుగా ఉన్న మూర్తిని దక్షిణామూర్తిగా గమనిస్తాం. కానీ వేదాంతశాస్త్రంలో కొంత పరిచయం ఉన్నవారికి దక్షిణామూర్తి చాలా ముఖ్యమైన ప్రతీక. దక్షిణామూర్తి స్తోత్రం అనే చిన్న స్తోత్రం ఉపనిషత్తుల అర్థాన్నంతా అందిస్తుంది.

శివుడు లయ కారకుడు. అంటే సృష్టిని విలీనం చేసుకొని కొత్త సృష్టికి మార్గాన్ని కల్పిస్తాడు. జ్ఞానంపై ఆసక్తి లేనివాళ్లను మళ్లీ జన్మ ఉండేటట్లుగా లయం చేయడం, జ్ఞానం కోరేవాడికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్లీ జన్మ లేకుండా భగవంతుని స్వరూపంలో కలపడం అనే రెండు రకాలుగా శివుడు లయం చేస్తాడు. శివుని యొక్క జ్ఞానావతారమే దక్షిణామూర్తి.