Banner
Photo by Vivek Sharma on Unsplash

అక్షయ తృతీయ అంటే పసిడి పండగ అని అర్థం. ఈ పండగ రోజు ఎంతో కొంత బంగారం కొంటే చాలు.. సిరి సంపదలు సమకూరుతాయనేది ఓ నమ్మకం. అందుకే ప్రతి ఏటా అక్షర తృతీయ పండగకు బంగారు దుకాణాలు జనాలతో కిక్కిరిపోతుంటాయి. అయితే అక్షర తృతీయ అంటే కేవలం బంగారం కొనుక్కునే రోజు అనా అర్దం…? మరేంటి…మన హిందూ ధర్మం ఏమని చెప్తోంది. అలాగే అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే..?? ఏం చేయాలో చూద్దాం.

అక్షయ తృతీయ అసలు అర్దం ఏమిటంటే… .. అక్షయ తృతీయ అంటే అక్షయ పూరితమైన ఫలితాన్ని ఇచ్చేది అని అర్థం. ఆరోజు చేపట్టే మంచి పనులు అక్షయమవుతాయని చెబుతారు. అయితే మన వాళ్లు దాని అర్దం వేరే రకంగా తీసుకున్నారు. మంచి పనులు చేయటం అనే విషయం ప్రక్కన పెట్టి….ఈ అక్షయ తృతీయనాడు బంగారం కొనుక్కుంటే అక్షయమవుతుంని ప్రచారం మొదలెట్టారు.

అందుకే ప్రతి ఏటా అక్షయ తృతీయ రోజు డబ్బులు లేని వాళ్లు కూడా అప్పు చేసి మరీ బంగారం , విలువైన వస్తువులు వంటివి కొనుగోలు చేస్తున్నారు. పైగా ఆ రోజు బంగారం ఎంత రేటు లో ఉన్నా సరే వెనుకాడకుండా ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం చేయడం వల్ల బంగారు రెట్టింపు అవుతుంది నమ్మకం.

వాస్తవానికి ఈ రోజున బంగారం కొనాలనేది హిందూ ధర్మంలో ఎక్కడా లేదు. కొన్నేళ్లుగా కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం ప్రచారంలోకి తీసుకు వచ్చింది తప్ప మరొకటి కాదు. అంతేకాదు, అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే కలి పురుషుని స్థానం బంగారంపై ఉంటుందని చెబుతున్నారు పండితులు.

ఇక బంగారం కొనుక్కోవటం అనే విషయం పక్కన పెట్టి ..అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి పూజలు చేస్తే ఫలితం ఉంటుందంటున్నారు. అంతేకాదు ఏదైనా ఈరోజు మంచి పని చేసి, ఈ రోజు శుభ సమయం గా ఉంచుకోవడం మంచిది.

ఇక అక్షయ తృతీయ రోజు ఏవైనా ధాన్యం కానీ జొన్నలు కానీ కొనుగోలు చేసి విష్ణువు సమర్పించి, ఆ తర్వాత ఎర్రటి వస్త్రంలో చుట్టి వాటిని భద్రపరుచుకోవాలి. అలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఇక ధాన్యం వృద్ధి చెందుతుంది. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే.. గవ్వలు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. అందుకే ఆరోజు గవ్వలు కొన్ని లక్ష్మీ దేవి పాదాల వద్ద సమర్పిస్తే అంతా మంచి జరుగుతుంది. ఇక ఆచార వ్యవహారాల ప్రకారం పూజలు చేసి మరుసటి రోజు ఆ గవ్వలను ఎర్రటి వస్త్రంలో చుట్టి ఇంట్లో పవిత్రమైన ప్రదేశం లో భద్రపరచాలి. ఇలా చేయడం వల్ల త్వరగా లక్ష్మీ కటాక్షం పొందవచ్చు.

Banner
, ,
Similar Posts
Latest Posts from daivam.com