ఇంత గొప్ప స్త్రోత్రం ఇంకెక్కడా దొరకదు

ఎలా చదవాలి ఈ వేయినామాలు 183 శ్లోకములలో చెప్పబడినవి. శ్రీమాతా అను నామముతో మొదలై లలితాంబికా అనునామముతో పూర్తవుతుంది. విడివిడిగా చదువుతే ఓం శ్రీమాత్రేనమః అని చదవాలి. అర్థము తెలుసుకునే చదవాలి. అలా వీలుకానప్పుడు నామజపము వలె చదవాలి. ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది. శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది.  ఇక శ్రీలలితా సహస్రనామములు కేవలం స్తోత్రం కాదు. ఇది గొప్ప శాస్తమ్రు. గొప్ప ప్రమాణం. వీడియోగా… ఇలా ఎంతో గొప్పగా మహామునులు చేత, దేవతల చేత చెప్పబడ్డ శ్రీ లలితా సహస్రం..ఇప్పుడు అంతే గొప్పగా…అత్యంత భక్తి ,శ్రద్దలతో ప్రముఖ సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్ గారి సారధ్యంలో… ప్రముఖ గాయని బాహుబలి ఫేమ్ సత్య యామిని మధుర గాత్రంతో  రికార్డ్ చేయబడింది. మీరు ఆ వీడియోని ఇక్కడ చూడవచ్చు.