భగవద్గీత ..ఈ మహాకావ్యం గురించి వినని భారతీయుడు ఉండడు.  ప్రపంచానికి భగవాన్‌ శ్రీకృష్ణ పరమాత్మ  స్వయంగా అందించిన అద్బుత వ్యక్తిత్వ వికాసం  భగవద్గీత. ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అర్జునుడు దాయాదులతో యుద్ధం చేయలేనని నిరాశతో ఆవేదనను వ్యక్తం చేయగా కృష్ణుడు విశ్వరూపంతో దర్శనమిచ్చి.. జీవిత పరమార్థాన్ని బోధిస్తాడు. ఆయన వ్యాఖ్యానమే భగవద్గీత. గీత అంటే వాక్కు (మాట). భగవంతుడి వాక్కులే  భగవద్గీత. పవిత్ర గ్రంథమైన గీతకు గీతోపనిషత్‌ అనే పేరు కూడా వుంది.

మార్గశిర మాసంలో శుక్లపక్షం ఏకాదశిన అంటే ఈ రోజున భగవద్గీత బోధన జరిగింది. అందుకనే ప్రతీ సంవత్సరం ఈ రోజున గీతాజయంతిని జరుపుకొంటున్నాం. గీతా పఠనం ఆధ్యాత్మిక విలువలను పెంచటమే కాకుండా ప్రపంచజ్ఞానాన్ని అందిస్తుంది.

ఆ మహాగ్రంథాన్ని పఠించడం ద్వారా జీవిత విలువలను తెలుసుకుంటాం. ఆదర్శ జీవితాన్ని గడిపేందుకు గీతా పఠనం ఎంతో దోహదం చేస్తుంది. అత్యంత విలువలతో కూడిన జీవితాన్ని భగవద్గీత బోధిస్తుంది.

  కృష్ణుడంటాడు ‘ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్ధ దర్పణం …….’ అని,

అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్ధములకు అద్దం వంటిది.  దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణపదం పొందుతారు.  ఇలా భగవంతుడే స్వయంగా  విష్ణుపదానికి హామీ ఇచ్చినటువంటి ఈ భగవద్గీతని ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తిగారు సరళమైన భాషలో అనువదించి..అందించారు. భగవద్గీత లో ఉన్న 18 యోగముల్లో ఉన్న 700 శ్లోకాలకి చక్కటి  తాత్పర్యం చెప్పారు . ప్రముఖ గాయకుడు శ్రీ రాణి శ్రీనివాస్ శర్మ దీన్ని పఠించారు . మీరు ఇక్కడ ఈ లింక్ లో పొందవచ్చు. శుభమస్తు

Similar Posts
Latest Posts from daivam.com