కళ్ల ముందు శివడుని నిలిపే ప్రయత్నం..అద్బుతం

మన హిందూ సంప్రదాయంలో శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి.  కొందరు ఆయన్ని భోళా శంకరుడు అంటారు.   ఎందుకంటే ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని చెప్తాడు. . “భోళా శంకరుడు”  పిలిస్తే పలుకుతాడు. ఏది కోరితే అది వెంటనే ఇచ్చేస్తాడు. మోక్ష ప్రాప్తికి ఉత్తమ మార్గము. సకల జీవులకు, పరమ శాంతికై పలు రీతులలో సాధనలు చేయుటకు పరమ గమ్యుడు శివుడు.
 ‘శివ’ శబ్దం మంగళప్రదం. శివుడు మంగళప్రదుడు. ‘లింగం’ అంటే చిహ్నమనీ, సంకేతమనీ, ప్రతీకయని అర్థం. సృష్టించబడిన వస్తు సమూహం యావత్తూ విలీనం చెందిన ప్రదేశమే అంటే స్థానమే ‘లింగం’ అని భావం. అలాగే లింగమునకు బిల్వార్చన ప్రముఖమైనది. మూడు దళములతో కూడిన బిల్వపత్రమును ఏకత్వానికి ప్రతీకగా శివునికి అర్పించాలి. ‘ఏకబిల్వం శివార్పణం’ ‘అభిషేక ప్రియశ్శివః’ అని శాస్త్రం. మానవులలోని విషయ వాసనలను పదకొండింటిని ప్రసన్నం చేసుకొనుటకు రుద్రాభిషేకం చేయాలి. నీటిని ధారగా, మెల్లగా లింగంపై పోయాలి. జలంలో దివ్యత్వం ఉంటుంది. శివుడిని జలధారో ప్రియః అంటారు.
అలాంటి శివునికి అత్యంత ఇష్టమైనది..లింగాష్టకం. లింగాష్టకం ఎవరైతే పఠిస్తారో లేదా వింటారో  వారు కాశీకి వెళ్లి వచ్చినంత పుణ్యాన్ని ఆర్జిస్తారని చెప్తారు. దాన్ని ఆధారం చేసుకుని ప్రముఖ సంగీత దర్శకుడు సాయి శ్రీకాంత్ గారు లింగాష్టకాన్ని మరోసారి మృదు మధురంగా మనకు తన గాత్రంతో పాడారు. యూట్యూబ్ రంగంలో పేరెన్నికగన్న సుమన్ టీవి వారు ఈ వీడియోని మనకు భర్తి పూర్వకంగా అందించారు.
 ఈ వీడియోలో లింగాష్టకాన్ని కళ్లు మూసుకుని వింటే శివుడు ఎదుట అలా కనపడతాడు అనటంలో సందేహం లేదు. మీరూ ఓ సారి ప్రయత్నించండి. ఈ వీడియో ప్రస్తుతం లక్ష వ్యూస్ దాటి శివ భక్తుల వీక్షణలతో ముందుకు వెళ్తోంది.  ఓం నమః శివాయ ..ఓం నమః శివాయ ..ఓం నమః శివాయ .