
”యా కుందేందు తుషారహార దవళా యాశుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత కరా యశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతి భిర్దేవైస్సదా పూజితా
సమాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా”
నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు ఐదో రోజుకు(ఆశ్వయుజ శుద్ధ పంచమి., ఆదివారము) చేరుకున్నాయి. ఈ మూలా నక్షత్రం రోజున అమ్మ …సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది.
జ్ఞానానికి అధిష్టాన దేవత అయిన సరస్వతి… బ్రహ్మ చైతన్యంతో హంస వాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిస్తుంది.
అలాగే… సంగీత రస స్వరూపమైన నెమలి వాహనంగా, ధవళ వర్ణ వస్త్రాలను ధరించి, అక్షమాలను, వీణను రెండు చేతులతో ధరించి , చందన చర్చితమైన దేహంతో దర్శనమిస్తుంది.
సరస్వతీ దేవిని ధ్యాని౦చేటప్పుడు ఆరాధి౦చేటప్పుడు అకారాది క్షకారాన్త మాత్రా వర్ణములే సరస్వతీ రూమున మూర్తీభవి౦చినట్లు భావి౦చాలి.
స్మృతులు ఏం చెబుతున్నాయి
సరస్వతి బుద్ధి ప్రదాయిని, వాగ్దేవి. సకల ప్రాణుల నాలికపై ఈ వాగ్దేవత నివసిస్తుందని స్మృతులు చెబుతున్నాయి.
సరస్వతీ దేవిని అర్చిస్తే అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. బుద్ధి వికాసం జరుగుతుంది. త్రిశక్తి స్వరూపాలలో ఈ అమ్మ మూడవ శక్తి. విద్యార్థుల పాలిట కల్పవల్లి. పెసరపప్పు పాయసాన్ని సరస్వతీ దేవికి నైవేద్యంగా నివేదించాలి.
నైవేద్యం – పెసరపప్పు పాయసం,దద్దోజనం.
ధ్యాన శ్లోకం
నమస్కృత్య జగత్పూజ్యా౦ శారదా౦ విశద ప్రభామ్
శ్రిత పద్మాసనా౦ దేవీ౦ త్ర్య౦బకీ౦ శశి భూషణామ్!!
పద్మముపై కూర్చుని యున్నది, మూడు కళ్ళతో చ౦ద్ర రేఖతో నిర్మలమైన కా౦తితో శోభిల్లుచున్నది, సమస్త జగత్తులకు పూజ్యురాలైన శారదా అమ్మవారిని నమస్కరి౦చుచున్నాను.