తొమ్మిదో రోజు – రాజరాజేశ్వరీ దేవిగా అనుగ్రహం

‘‘శంకరి, కరుణాకరి, రాజరాజేశ్వరి, సుందరి, పరాత్పరి, గౌరి అంబ.. పరమ పావని, భవాని, సదాశివ కుటుంబిని…’’ ఈ  రోజున అమ్మ… శంఖం, చక్రం, గద, పద్మం ధరించి ‘చతుర్భుజ’గా ,శ్రీ రాజ రాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తుంది. ఈ తొమ్మిది రోజుల అవతారమూర్తులనూ ‘నవదుర్గలు’గా కొలుస్తారు.   శంకర ఉవాచ శక్తి స్వరూపిణి, మహేశ్వరి, పరాశక్తి, జగన్మాత లేకుంటే పరమేశ్వరుడైనా ఏమీ చెయ్యలేడని శివునికి యొక్క శక్తి రూపమే “దుర్గ” అని ఆదిశంకరాచార్యులు చెప్పారు.  పూజ ఎలా చేయాలి ఎర్రటి బట్టలను ధరించి అమ్మవారిని ఎర్రటి పువ్వులు,పసుపు,కుంకుమలతో పూజ చేయాలి. సాయంత్రం ఆరు గంటలకు పూజ ప్రారంభించాలి. దీపారాధనకు తొమ్మిది వత్తులతో దీపాన్ని సిద్ధం చేసుకోవాలి.  నైవేద్యం పొంగలి,పులిహోర,అరటిపండ్లు నైవేద్యంగా పెట్టాలి.  రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారములను పఠించడం శ్రేయస్కరం. అలాకాకుంటే.”శ్రీ మాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దసరా రోజున ఏ పని మొదలు పెట్టిన విజయవంతం అవుతుంది.

 దశమి (విజయదశమి) నాడు ఉత్తిరాదిన “రావణవధ” మహాకోలాహలంగా జరుగుతుంది. అంటే చెడును జయించి మంచికి పట్టంకట్టటమని ఆ విధాన అంతరార్దం.  విజయాన్ని చేకూరుస్తుంది కనుక దీనిని విజయదశమిగా వ్యవహరిస్తారు.