ఆది శంకరాచార్యులు వారి ‘నిర్వాణ షట్కం’

పరమేశ్వరుడైన శంకరుని మహిమ అపారమైనది. ఆది అంతం లేనిది…అద్భుతమైనది. శివుని మహిమ వాక్కులకు, మనస్సునకు అందనిది. అందుకే ఆయన్ని తలిస్తే చాలు సర్వ పాపాలు పోయి..సర్వ మంగళం విరసిల్లుతుంది. ‘మహేశ్వరాదిచ్ఛేత్’ అనే శ్రుతి వచనం అనుసరించి శివారాధన వలన, ఆత్మజ్ఞానం కల్గునని ప్రసిద్ధి. మరీ ముఖ్యంగా ఈ కార్తీకమాసంలో శివుడు ఏది అడిగినా అనుగ్రహించటానికి సిద్దంగా ఉంటాడు. . ‘శివ’యనే రెండక్షరాలు అసాధ్యాలను సుసాధ్యాలు చేస్తాయి. శివనామం సర్వ వశీకరణ మంత్రం.  మోక్ష ప్రాప్తికి ఉత్తమ మార్గము. సకల జీవులకు, పరమ శాంతికై పలు రీతులలో సాధనలు చేయుటకు పరమ గమ్యుడు శివుడు. అటువంటి శివ తత్వాన్ని ఆయన రూపంగా చెప్పబడే శంకరాచార్యులు వారు నిర్వాణ షట్కంలో అద్బుత రీతిన ఆవిష్కరించారు. ఆ నిర్వాణ షట్కం ని మీకు టీవి శివ వారు మనోరంజంకంగా అందిస్తున్నారు. మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం – న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమభూమిః న తేజో న వాయుః – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 1 || న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః – న వా సప్తధాతుర్న వా పంచకోశః న వాక్ పాణిపాదౌ న చోపస్థపాయూ – చిదానందరూపః శివోఽహం శివోఽహమ్ || 2 ||