ఆ పాత మధురానికి…సత్య యామిని కవర్ సాంగ్ తో ట్రిబ్యూట్

కొన్ని ఆ పాత మధురాలు వింటూంటే మనస్సు ఎక్కడికో వెళ్లిపోతుంది. అందుకేనేమో ..ఏ టీవీ ఛానెల్ లోనో హఠాత్తుగా పాత సాంగ్ రాగానే మన రిమోట్ …దానంతట ఆగిపోతుంది. మన హృదయం గతాన్ని స్పృశిస్తూ గమ్మత్తుగా మారిపోయి..ఆ రోజులను గుర్తు చేసుకుంటుంది. ఆ రోజంతా ఆ పాత(ట) పరిమళం ఉండిపోతుంది. అది గమనించినట్లుంది ప్రముఖ సింగర్ సత్య యామిని. బాహుబలి లోని ‘మమతల తల్లీ.. ఒడి బాహుబలీ’ పాటతో.. ఒక్కసారిగా వెలుగులోకొచ్చిన సత్యయామిని టాలీవుడ్‌ గాన ప్రపంచంలో.. ప్రత్యేక ఇమేజ్‌తో అలరిస్తోంది. ఆమె ఇప్పుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఘర్షణ’ చిత్రంలో ఇళయరాజా స్వరపచగా చిత్రగారు పాడిన నిన్ను కోరి పాటను ఏరికోరి ..మళ్లీ పాడి …కవర్ సాంగ్ రిలీజ్ చేసింది. ఆ పాట వచ్చి ఇన్నేళ్లు అయినా సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. ఆ పాటకు అందమైన ట్రిబ్యూట్ గా ఈ కవర్ సాంగ్ నిలిచిపోతుందనటంలో సందేహం లేదు.