శివానుగ్రహానికై…. శ్రీ శివ రక్షా స్తోత్రం

“చరితం దేవ దేవస్య మహాదేవస్య పావనమ్ అపారం పరమోదారం చతుర్వర్గస్య సాధనమ్ గౌరీ వినాయకోపేతం పంచవక్త్రం త్రినేత్రకమ్ శివం ధ్వాత్వా దశభుజం శివ రక్షాం పఠేన్నరహ”

అంటూ సాగే ఈ శ్రీ శివ రక్షా స్తోత్రంని ఎవరైతే ఈ కార్తీక మాసంలో పఠిస్తారో వారికి విశేష ఫలం లభిస్తుందని చెప్తారు. ఆ పరమశివుడే స్వయంగా వచ్చి మనలని ఆదుకుంటారని చెప్తుంటారు. అందుకే చాలా చోట్ల గుళ్లలో శ్రీ శివ రక్షా స్తోత్రంని పఠిస్తూంటారు. వింటూంటారు.అన్ని మాసాల్లో చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకన్నా.. కార్తీక మాసంలో చేసే ఉపవాసం,స్నానం, దానం ఎన్నో రెట్లు ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మీరు కూడా ఈ స్త్రోత్రరత్నా్న్ని విని ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందగలరు. శివోహం.

ఈ స్త్రోత్రాన్ని మీకు అందించిన వారు: శివ టీవి స్వరకల్పన చేసిన వారు: ప్రముఖ సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్ పాడిన వారు: ప్రముఖ గాయని సత్య యామిని