అద్బుతం..ఈ భ్రమక శ్లోకం

మనం పెద్దగా పట్టించుకోవటం లేదు కానీ మనకి అద్బుతమైన సాహిత్య సంపద ఉంది. ఆసక్తి ఉండి ..ఆంధ్రామృత సమానమైన కావ్యాల్లోని సాహత్యాన్ని సన్నిహితంగా చూడాలే కానీ తనివి తీరదు. ఆ అమృతం ఎంత గ్రోలినా ఇంకా గ్రోలాలనే ఉత్కంఠ ఆగదు! ఈ మహా సాగరంలో వెతికిన కొద్దీ అద్భుతమైన ఆణి ముత్యాలు బయిటపడతూనే ఉంటాయి. అలాంటి ఆణిముత్యం ఇప్పుడొకటి చూద్దాం. ఇప్పుడు క్రీ.శ.14. వాడైన దైవజ్ఞ సూర్య తన రామ కృష్ణ విలోమ కావ్యంలో వ్రాయఁబడిన ఒక అద్భుతమైన పాద భ్రమక శ్లోకం చూద్దాము.

“తం భూసుతా ముక్తిముదార హాసం వందే యతో భవ్యభవం దయాశ్రీః| శ్రీ యాదవం భవ్య భతోయ దేవం సంహారదా ముక్తి ముతా సుభూతం||”

ఈ శ్లోకం ‘శ్రీ రామకృష్ణ విలోమ కావ్యం’ లోనిది. కవి పేరు పండిత దైవజ్ఞ సూర్య సూరి. 14వ శతాబ్దపు, దివిసీమ తాలూకా కవి. ఈ శ్లోక విశేషమేమిటంటే మొదటినుంచి చివరకు చదివినా, చివరనుంచి వెనుకకు చదివినా ఒకేలాగ ఉంటుంది, అంటే వికటకవి లాగా అన్నమాట. మనం దీనిని Palindrome అంటాం. అర్థభేదం మాత్రం ఉంటుంది. ఎడమనుండి కుడికి చదివినప్పుడు శ్రీరామ పరంగానూ, కుడినుండి ఎడమకు చదివినప్పుడు శ్రీకృష్ణ పరంగానూ ఉంటుంది. గమనించండి,