శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్

‘ నా కార్తకసమో మాసో క కృతేన సమం యుగమ్‌, న వేదసదృశం శాస్త్రం స తీర్థం గంగయా సమమ్’ అని స్కంద పురుణంలో ఉంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసమేదీ లేదు, సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు, వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానదిని మించిన మరో నది లేనేలేదు అని అర్ధం. ఈ కార్తీక మాసంలో శివుడుని ఏ  రూపంలో ధ్యానించినా విశేష ఫలితం ఉంటుంది. ధార్మక యోచనలున్న వారు ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు.   ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్న శివాలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషరగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలు తీరుస్తాడని ప్రతీతి.  ఈ నేఫధ్యంలో శివ టీవీ వారు…శివుడుని విశేషంగా స్మరిస్తూ…శివ రూపమైన శ్రీ దక్షిణామూర్తి ,,,స్తోత్రమ్ ని సమర్పిస్తోంది. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా | యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||