శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్

అంటూ సాగే…దక్షిణామూర్తి రూపం చాలా శక్తివంతమైనది. శివాలయాలకు వెళ్లినప్పుడు శివుడి దర్శనం తర్వాత గుడి ప్రాంగణంలో దక్షిణ దిక్కుగా ఉన్న మూర్తిని దక్షిణామూర్తిగా గమనిస్తాం. కానీ వేదాంతశాస్త్రంలో కొంత పరిచయం ఉన్నవారికి దక్షిణామూర్తి చాలా ముఖ్యమైన ప్రతీక. దక్షిణామూర్తి స్తోత్రం అనే చిన్న స్తోత్రం ఉపనిషత్తుల అర్థాన్నంతా అందిస్తుంది. శివుడు లయ కారకుడు. అంటే సృష్టిని విలీనం చేసుకొని కొత్త సృష్టికి మార్గాన్ని కల్పిస్తాడు. జ్ఞానంపై ఆసక్తి లేనివాళ్లను మళ్లీ జన్మ ఉండేటట్లుగా లయం చేయడం, జ్ఞానం కోరేవాడికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్లీ జన్మ లేకుండా భగవంతుని స్వరూపంలో కలపడం అనే రెండు రకాలుగా శివుడు లయం చేస్తాడు. శివుని యొక్క జ్ఞానావతారమే దక్షిణామూర్తి.