సాధారణంగా మనం దేవాలయంకి వెళ్లినప్పుడు  దైవ దర్శనం అయ్యాక కొంచెంసేపు అక్కడ అరుగుమీదే  కూర్చుంటాం. ఈ విధంగా ఎందుకు కూర్చుంటామో మనలో చాలా మందికి తెలియదు.  పెద్దలు కూర్చోమన్నారు కాబట్టి కూర్చోవటమో లేక చిన్నప్పుడు నుంచి అలవాటు అవటం వలన కూర్చోవటమో చేస్తూంటాం.  అయితే కొంతమంది దైవ దర్శనం కాగానే హడావుడిగా వెళ్లి పోతూ ఉంటారు. వాస్తవానికి దైవ దర్శనం అయ్యాక గుడిలో కొంచెం సేపు కూర్చోవాలని మన ధర్మ శాస్త్రాలు చెప్పుతున్నాయి.  దర్శనం అయ్యాక గుడిలో కూర్చోవటానికి గల శాస్త్రీయమైన కారణాలను తెలుసుకుందాం…
మనం గుళ్లోకి వెళ్లినప్పుడు మన కళ్లను,మనస్సును పూర్తిగా తెరిచి భగవంతుడుని చూస్తాం. ఆ తర్వాత గుడి నుంచి బయిటకు వచ్చాక..ఓ చోట కూర్చుని… కళ్లు మూసుకుని అంతకు ముందు చూసిన భగవంతుడు స్వరూపాని గుర్తు చేసుకుంటూ చిన్న ప్రార్దన చేయాలి. అదేమిటంటే..
అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనందేహంతేన తవ సాయుజ్యం,  దేహిమే పరమేశ్వరా(బతికనంత కాలం దైన్యంలేని జీవితం,  అనాయసంగా మరణం దేహం వదిలాక నీ లో ఐక్యం కలిగేలా వరమీయ్యు తండ్రి) అని ఆయన్ని అడగాలి. 
అలా కూర్చుని ప్రార్దన చేయకుండా వెళితే, స్వామిని దర్శించిన ఫలం కూడా రాదు. అలా కూర్చున్నప్పుడు మంచి, చెడులు బేరీజు వేసుకుంటాయి. ప్రశాంత మనసుతో ఆలోచిస్తాం. ఏది తప్పు, ఏది ఒప్పు అని ఆలోచనలో పడతాము. రోజువారి జీవన విధానాన్ని సరిచేసుకొని సరైన మార్గంలో నడుస్తాము. గుడిలో కూర్చోవడం ఒక రకమైన ధ్యాన పద్దతి కూడా. కేవలం కూర్చోవడమే కాకుండా ఓ రెండు నిమిషాలు కనులు మూసుకొని ధ్యానం చేస్తే మరింత శుభం కలుగుతుంది.
అంతేకాదు.. దైవ సన్నిధిలో మంత్ర జపం లేదా ధ్యానం చేస్తే జ్ఞాపకశక్తి మెరుగు అయ్యి రెట్టింపు ఫలితాలను పొందుతాం. అందువల్ల దైవ దర్శనం అయ్యాక దేవాలయంలో కొంచెం సేపు కూర్చుంటే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది.

Similar Posts
Latest Posts from daivam.com