విశ్వనాధాష్టకం..శివ అనుగ్రహాన్ని ఇట్టే ఇచ్చే అద్బుతం

కార్తీక మాసం శివునికి ప్రీతికరమైన మాసం, కాబట్టి ఈ మాసంలో చాలా మంది ఆ పరమాత్ముడుని నిరంతరం స్మరిస్తూ, ఆయనకు సంభందించిన వచనాలు వింటూ, కార్తీక పురాణం పఠనం చేస్తూ, ఆ ఆదిదేవుని కృపకు పాత్రులవుతూంటారు. శివుని ఈ మాసంలో స్మరిస్తే చాలు..సమప్త పాపాలు పోతాయని చెప్పబడింది. శివ స్మరణలో గడిపేవారికు మృత్యువు కూడా అల్లంత దూరాన ఆగిపోతుంది. వ్యాధులు, రుణ బాధల నుంచి బయిటపడతారు. దుఖానికి దూరమై సుఖ సంతోషాలు పొందురాని మన పురాణాలు చెప్తున్నాయి. మరి ఈ మాసంలో ఆ శివుని అత్యంత ప్రీతి పాత్రమైన వ్యాసమహర్షి కృత విశ్వనాధాష్టకం పఠిస్తే ఫలితం ఎలా ఉంటుంది. …అలాగే సుస్వరయుక్తంగా సాగే విశ్వనాధాష్టకం వింటే ఎంత ఫలితం ఉంటుందో ఊహించండి. అంతటి అద్బుతమైన విశ్వనాధాష్టకాన్ని మీకు అదే అద్బుత రీతిలో …శివ టీవి వారు అందిస్తున్నారు. విని తరించండి.

గంగాతరంగ రమణీయ జటా కలాపం, గౌరీ నిరంతర విభూషిత వామ భాగం; నారాయనః ప్రియ మదంగ మదాప హారం, వారాణసి పురఃపతిం భజ విశ్వనాథం.||

అంటూ సాగే విశ్వనాధాష్టకం చాలా శివాలయాలులో పఠిస్తారు భక్తులు. అలాగే ఉదయాన్నే ఈ అష్టకాన్ని వింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, ఆ రోజంతా ఓ రకమైన భావనతో గడుస్తుందని చెప్తారు. కళ్లు మూసుకుని ఈ అష్టకాన్ని వింటే శివుడు ఎదురుగా వచ్చి నిలబడినట్లు అనిపిస్తుంది. అంత గొప్పదీ అష్టకం. వినండి..మీరూ పఠించటానికి ప్రయత్నించండి..ఆ శివుని అనంతమైన ఆశీస్సులు పొందండి..ఓం నమ శివాయ.

ఈ అష్టకాన్ని మీకు సభక్తితో సమర్పించినవారు: శివ టీవి స్వరపరిచి, పాడినవారు:ప్రముఖ సంగీత దర్శకులు సాయి శ్రీకాంత్